
మన దాస, నెల్లూరు, ఫిబ్రవరి 6: బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం రావాలని బిసివై పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ఉల్లిపాయల లీలాకృష్ణ యాదవ్ శుక్రవారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో అన్నారు. బి సి వై పార్టీ రాష్ట్ర పిఎసి మెంబర్ ఎస్.ఎస్ యాదవ్ మాట్లాడుతూ..... ఈరోజు సమాజంలో ఉండే అధర్మాన్ని ఎదుర్కోవడానికి,ధర్మాన్ని రక్షించడానికి కోసమే పెట్టిన పార్టీ బీసీవై పార్టీ అని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వారి దామాషా ప్రకారం రాజ్యాధికారం ఇవ్వాలని ఉద్దేశంతోనే బోడె రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ స్థాపించారు అని అన్నారు. మా ఈ ప్రయాణం ఒక్క అడుగుతో మొదలయ్యింది. పార్టీ గ్రామస్థాయి వరకు తీసుకు వెళ్లాలని, ప్రజల్లో చైతన్యం తేవాలని,తద్వారా బీసీలకు,మైనార్టీలకు, ఎస్సీ,ఎస్టీలకు రాజయోగం రావాలని ఉద్దేశంతోనే మా ఈ ప్రయాణం కొనసాగుతుంది అని అన్నారు.బీసీవై పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ లీలా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ..... నేను గత 20 సంవత్సరాలుగా బీసీ విద్యార్థిగా ఉద్యమాలు నిర్వహించి,రాష్ట్రమంతా ప్రయాణించి ఎన్నో సభలు నిర్వహించినాను అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య తో కలిసి ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాను అని అన్నారు.బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం రావాలని తరుణంలో 2023 సంవత్సరంలో బోడె రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ ఏర్పాటు చేశారు అని అన్నారు. మా ఆకాంక్ష,మా కోరిక బోడె రామచంద్ర యాదవ్ తీర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత బీసివై పార్టీ రాష్ట్ర కమీటి నియమించారు. రాష్ట్ర పీఏసీ మెంబర్గా ఎస్. ఎస్ యాదవ్, నెల్లూరు జిల్లా కనీనర్గా బుద్ధారం బాలాజీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సోమ గోపాల్, జిల్లా యూత్ కన్వీనర్ గా పామూరు హరినాథ్ యాదవ్, జిల్లా యూత్ కో కన్వీనర్ గా కొణిదల నాగేంద్ర లను నియమించారు.జిల్లా బీసీవై కార్యవర్గ సభ్యులందరూ లీలా కృష్ణ యాదవ్ ని ఘనంగా సన్మానించి పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేస్తామని తెలిపారు.


