మన న్యూస్: మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లంక మల్లారం గ్రామం లో 20 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ కార్యాలయన్ని శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అంగన్వాడి పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం గ్రామపంచాయితీ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పాయం ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లక్షలు ఖర్చుపెట్టి గ్రామపంచాయితీ కార్యాలయాలు నిర్మిస్తుందని ప్రజలకు ఏ సమస్య వచ్చిన పంచాయతీ సిబ్బంది తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఏప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేలా ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని తెలియజేశారు గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అయినా గాని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరు మీద ఇస్తూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు