ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || february 4, 2026, 9:10 pm
నేర స్వభావాన్ని వీడాలి..
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక..
సిఐ మంజునాథరెడ్డి, ఎస్సై కౌన్సిలింగ్… రేణిగుంట మన న్యూస్ 4. గాజలమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ మంజునాథరెడ్డి, ఎస్సైతో కలిసి రౌడీషీటర్ల ప్రస్తుత జీవనశైలి మరియు వారిపై ఉన్న కేసుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పాత నేరాలను వదిలిపెట్టి సన్మార్గంలో జీవించాలని ఆయన హితవు పలికారు. రౌడీషీటర్ల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు. నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాజలమండ్యం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నేర స్వభావాన్ని వీడాలి..నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక..సిఐ మంజునాథరెడ్డి, ఎస్సై కౌన్సిలింగ్...రేణిగుంట మన ద్యాస ఫిబ్రవరి 4.గాజలమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ మంజునాథరెడ్డి, ఎస్సైతో కలిసి రౌడీషీటర్ల ప్రస్తుత జీవనశైలి మరియు వారిపై ఉన్న కేసుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పాత నేరాలను వదిలిపెట్టి సన్మార్గంలో జీవించాలని ఆయన హితవు పలికారు. రౌడీషీటర్ల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు. నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాజలమండ్యం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.