మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండల జె. అన్నవరం గ్రామ పంచాయతీల పరిధిలో ఏలేరు జలాశయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ప్రభుత్వం అందించిన మత్సకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేశారు.మంగళవారం జై అన్నవరం లో నిర్వహించిన కార్యక్రమంలో ఆప్ కబ్ వైస్ చైర్మన్ కే రంగారావు చేతుల మీదుగా 4 లక్షల 40వేల చేప పిల్లలు రిజర్వాయర్ లోకి విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మత్స్యశాఖ అధికారులు మాట్లాడుతూ ఏలేరు జలాశయం 5936 హెక్టార్ల విస్తరణ లో ఐదు మండలాలకు విస్తరించి ఉందన్నారు. దీన్ని క్యాచ్ మెంట్ ఏరియల్ 2 లక్షల 23 వేల 2 వందల హెక్టార్ల వైశాల్యం కలిగి ఉందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా బీసీ మత్స్యకారులకు 40 శాతం సబ్సిడీతో 4 లక్షల 40 వేల మేలు జాతి నాణ్యమైన కడ్ల, రాగండి, వంటి చాప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ చేప పిల్లలు విడుదలతో మత్స్యకారులకు మత్స్య సంపదని సమకూర్చడం ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. ఏలేరు ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 400 మంది అనుమతి పొందిన మత్యకారు కుటుంబాలు జీవనోపాధి పొందుతున్న అన్నారు ఏలేరు జలాశయం పరిసర ప్రాంతాలకు మంచి నాణ్యమైన ప్రోటీన్లు అధికంగా గల పెరిగే చేప పిల్లలను ఆహారంగా అందించవచ్చని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేదికపై జిల్లా మత్స్యశాఖ అధికారి ముఖ్యఅతిథిగా పాల్గొని మత్స్యకారులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ ద్వారా అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని దీనిలో ప్రధానంగా వేట సమయములో ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పించడం ద్వారా వారి కుటుంబాలకి కేంద్రప్రభుత్వం ఐదు లక్షల బీమా సౌకర్యం చెల్లించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు లక్షలు ఇస్తుందన్నారు. అలాగే మత్స్యకారులు వేటకు వినియోగించే మరబోట్లు 40,60 శాతం సబ్సిడీతో మర బోట్లు వలలు వంటివి అందించడం జరుగుతుందన్నారు. అలాగే వ్యాపారాలకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మత్య సంపదని తరలించేందుకు అవసరమయ్యే వాహనాలను ప్రభుత్వము ద్వారా పొందుతున్నారు. ఆటోలు వ్యాన్లు, మోపెడ్ బండ్లు వంటి వాహనాలను సబ్సిడీపై పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్టు అభివృద్ధి కమిటీ చైర్మన్ బసవ వీరబాబు, మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి,చిక్కాల లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పసలసూరిబాబు, సీనియర్ నాయకులు అలకరాజు, ఎన్ ఈశ్వరుడు, పెంటకోట శ్రీధర్, ఎస్ వి వి శ్రీను, సూతి బాబులు, పెంటకోట సత్తిబాబు,ప్రత్యేక పర్యవేక్షణ అధికారి నాగయ్య, ఏడి లావణ్య తదితరులు పాల్గొన్నారు.