మన న్యూస్: ఆదిభట్ల పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులతో మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం జరిగింది. విద్యుత్ పంపిణీ,నీటి సరఫరా కు సంబంధించి సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆదిభట్ల మున్సిపల్ ప్రాంతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి ఇక్కడ కంపెనీ ఏర్పాటుచేసి ఎనలేని కృషి చేసిన రతన్ టాటా సేవలకు గుర్తుగా, ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ రతన్ టాటా చిహ్నంగా ఓ ఆర్ ఆర్ నుండి ఆదిభట్ల వెళ్లే రోడ్డు మార్గానికి రతన్ టాటా మార్క్ గా నామకరణం,ఇంకా రతన్ టాటా కాంస్య విగ్రహ ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ పాలకవర్గం సభ్యులతో కలిసి తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కామాండ్ల యాదగిరి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మున్సిపల్ కౌన్సిలర్ గొపాగళ్ల మహేందర్, కాంతి సంధ్యా దయాకర్, కోరె కళమ్మ జంగయ్య, వనం శ్రీనివాస్, కుంట్ల మౌనిక ఉదయపాల్ రెడ్డి, నల్లవోలు లావణ్య పాండురంగారెడ్డి, కొప్పు కృష్ణంరాజు, నారనీ కవిత సుధాకర్, మరి అర్చన రాంరెడ్డి, కోల నాగేష్ వివిధ శాఖల అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు