
చిత్తూరు ఫిబ్రవరి 2 మన ద్యాస
రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో, ఫైడ్ (వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ పాఠశాలలకు అందించే దిశగా ప్రస్తుతం ప్రణాళికలు మరియు చర్చలు రూపుదిద్దుకునే దిశలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రీడ్స్ డైరెక్టర్ థియో స్టీఫన్స్, మాట్లాడుతూ చెన్నైలో ఇటీవల నిర్వహించిన ఫైడ్ చెస్ ఇన్ ఎడ్యుకేషన్... నిర్వహించిన సెమినార్ లో పాల్గొనడం జరిగిందని, ప్రపంచస్థాయి చెస్ విద్యా విధానాలపై కీలక అంశాలను అవగాహన చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం డబ్ల్యు.ఐ.ఎం రిటా అట్కిన్స్ డాక్టర్. ఎబెనేజర్ జోసెఫ్ మాట్లాడుతూ ఫైడ్ చెస్ ఇన్ ఎడ్యుకేషన్ కమిషన్ స్విజర్లాండ్, చెస్ ను విద్యలో భాగంగా అమలు చేయడం వల్ల విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, ఏకాగ్రత సమస్య,పరిష్కారం, నైపుణ్యం, క్రమశిక్షణ, మరియు నాయకత్వ లక్షణాలతో విద్యార్థులు అభివృద్ధి చెందే దిశగా ఉంటాయని ఆమె తెలిపారు. అనంతరం ఈ ప్రతిపాదిత కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి రీడ్స్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ విభాగాలు విద్యాశాఖలు, స్థానిక సంస్థలతో భాగస్వామ్యంతో అవకాశాలను పరిశీలనలోకి తీసుకొని పాఠశాలలు, ఉపాధ్యాయులు, మరియు కమ్యూనిటీతో కలిసి పనిచేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా రీడ్స్ సంస్థ డైరెక్టర్ థియో స్టీఫెన్స్ మీడియాకు తెలిపారు.
