
అహర్నిశలు రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న నేతలను దూషించడం దుర్మార్గం..కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వారిని వదిలిపెట్టడు.. మూల్యం చెల్లించుకుంటారు..స్కిల్ డెవలప్మెంట్ కేసులో కడిగిన ముత్యంలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు ఈడి తీర్పునిచ్చింది..కేంద్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..
వింజమూరు, మన న్యూస్, ఫిబ్రవరి 2, (నాగరాజు కె,)
రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తుంటే వారిపై వైసీపీ నాయకులు మరియు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, రాయలేని భాషలో దుర్బుషలాడడం దుర్మార్గమని అటువంటి వారిని చట్టసభలకు రాకుండా ప్రజలే బుద్ధి చెప్పాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు.

సోమవారం ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 19 నెలల కాలంలో చేసిన అభివృద్ధిని వివరించారు. వైసిపి నాయకులు మాజీ మంత్రులు పనిగట్టుకొని ముఖ్యమంత్రిని మంత్రులను దూషిస్తున్నారన్నారు. వారికి బుద్ధి వచ్చేలా న్యాయం గెలిచిందని జైలుకు వెళ్లారని తెలిపారు.నోటిని అదుపులో పెట్టుకొని రాజకీయం చేయాలని కుటుంబాలను బజారుకు లాగడం అన్యాయమన్నారు. ఇకపై ఇలాంటి అవాకుల చవాకులు పేలిస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా 250 కోట్ల రూపాయలు లడ్డు కుంభకోణం జరిగిందని తెలిపారు. సుమారు 20వేల లడ్డులను కల్తీ నెయ్యితో చేసి ఆదాయానికి పాలుద్ద పడ్డారన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వీరిని ప్రజలు 151 సీట్ నుండి 5 అంకెను తొలగించి 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. అయినప్పటికీ వీరికి బుద్ధి రాలేదన్నారు. ఇటువంటి వారిని దేవుడు ప్రజలు క్షమించకూడదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు. ముఖ్యమంత్రికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని ఈడీ తీర్పునిచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్ర చేసి బాబు ని జైలుకు పంపారన్నారు

.అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అభివృద్ధి, సంక్షేమం,రాజకీయంపై,అవగాహన,పెంచుకోవాలన్నారు. ఆయన మంచి వ్యాపారవేత్త అని రాజకీయ నాయకుడు కాదన్నారు. పారిశ్రామిక రంగానికి భూములు కేటాయించడం పట్ల ఆయన మాట్లాడడం అనైతికమన్నారు. సొంత భూములు ఎవరు ఎవరని ప్రభుత్వ భూములు మాత్రమే కర్మాగారాలు ఇస్తారని తెలుసుకోవాలన్నారు. ఉన్నతంగా విమర్శలు చేయాలన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన నిధులు కేటాయించారని, కేంద్ర ప్రభుత్వం అండతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అదేవిధంగా కూటమి నాయకులకు కూడా హుందాగా రాజకీయం చేయాలని, దూషణలకు వెల్ల వద్దన్నారు. ప్రజలకు సేవ చేయాలి తప్ప ఎవరిని బాధించకూడదని హితబోధ చేశారు. అనంతరం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్ను బోయిన చంచల బాబు యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని బూతులు మాట్లాడడం అనైతికమన్నారు. ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. వైసిపి పార్టీ వారి నైజమే ఎదుటివారిని తిట్టడమేనన్నారు. నెల్లూరు జిల్లాలో కూడా ఈ కోవకు చెందిన నాయకులు ఉన్నారన్నారు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే అంబటి రాంబాబుకు జరిగిన గతే అందరికి జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎల్సి రమణారెడ్డి, మండల కన్వీనర్లు గూడా నరసారెడ్డి, చింతల శ్రీనివాసులు, చండ్రా మధుసూదన్ రావు, సిహెచ్ బయన్న, మునగాల తిరుమలరెడ్డి, వెంకటాద్రి, సీనియర్ నాయకులు మధుమోహన్ రెడ్డి, వెంగప నాయుడు, అధికార ప్రతినిధి చీదర్ల మల్లికార్జున, కప్పా ప్రభాకర్ రాజు, బొజ్జ నరసింహులు, ఇతర ముఖ్య నాయకులు తదితరులున్నారు.