మన న్యూస్, నిజాంసాగర్ ,( జుక్కల్ ) సోషల్ మీడియా దుష్ప్రచారం మాకు ఆశీర్వదమే యాసంగి పంటలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల నాగమడుగుతో జుక్కల్ కు పుష్కలంగా సాగునీరు లెండి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవిధంగా కృషి సంక్రాంతికి రైతు భరోసా విడుదల ఖాయం.భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఐదేండ్ల పాటు రైతులకు సన్న వడ్లకు రూ.500 రూపాయలు బోనస్ ఇవ్వడం ఖాయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా దుష్ప్రచారం మాకు ఆశీర్వదమే అనిఅన్నారు. యాసంగి పంటలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాగమడుగుతో జుక్కల్ కు పుష్కలంగా సాగునీరు లెండి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవిధంగా కృషి అన్నారు సంక్రాంతికి రైతు భరోసా విడుదల ఖాయం మని అన్నారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి. నిజాంసాగర్,కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఐదేండ్ల పాటు రైతులకు సన్న వడ్లకు రూ.500 రూపాయలు బోనస్ ఇవ్వడం ఖాయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టు యాసంగి పంటలకు సాగు నీటిని విడుదల చేసేందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు,మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,బాన్సువాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నిజాంసాగర్ ప్రాజెక్టు రూపకర్త నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహానికి పులామాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.. నిజాంసాగర్ ప్రాజెక్టు దేశ చరిత్రలో గొప్పదని , వందేండ్ల ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉందని దేశం గర్వించే విధంగా నిర్మించిన ఆనాటి నిజాం ప్రభుత్వం పని తీరును కొనియాడారు. నీటి పారుదలశాఖ మంత్రిగా నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శించడం చాల సంతోషంగా ఉందని అన్నారు. గత పదేండ్ల పాలనలో ఇరిగేషన్ శాఖలో చాల నష్టం వాటిల్లిందని అన్నారు. ఏకంగా రూ.1.81 లక్షల కోట్లు నష్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి కి 27 లక్షల కోట్లు ఖర్చు చేసిన 1 ఎకరం భూమి పండలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణం కొరకు లక్ష కోట్లు ఖర్చు చేసి సాగు నీరు అందించలేక పోయారని వారి స్వలాభం కొరకు నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు. ఇదే కాకుండా రాష్ట్రంలో ఇలా చాలా ప్రాజెక్టులు లక్షలు ఖర్చు చేసిన రైతులకు ఒక్క ఎకరం కూడా నిల్లు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పక్క ప్రణాళికలతో రైతుల సంక్షేమం కొరకు తక్కువ నిధులతో సాగు నీరు అందించేదుకు కృషి చేస్తున్నామని అన్నారు.రాష్ట్రంలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు సాగు నీరు అందిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో వరి పంటలు దేశంలోనే ఎక్కువ పంట తెలంగాణలో పండిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 66.7 లక్షల ఎకరాల్లో వరి పంటలు పండించామని,40 లక్షలు రైతులు వరి పంటలు పండించారాని అన్నారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా పంటలు పుష్కలంగా పండాయని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి 3 నుండి -4 రోజుల్లో డబ్బులు రైతులకు అందజేశామని అన్నారు. అదేవిధంగా సన్న రకం వడ్లను ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ అందించామని అన్నారు. కొన్ని సోషల్ మీడియా ద్వారా అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇదేండ్ల పాటు రైతులు పండించిన సన్న రకం వడ్లకు రూ. 500 రూపాయలు బోనస్ అందిస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు సన్న వడ్లు పండించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతుల సంక్షేమం కొరకు పాటు పడుతుందని తెలిపారు.రైతు భరోసా సంక్రాంతికి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శించడం సంతోషంగా ఉందని,వండెండ్ల ప్రాజెక్టు గట్టిడదానికి నిదర్శనం అయన అన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకొని నీటిని కాపాడుకోవాలిని అన్నారు. నాగమదుగు లిఫ్ట్ త్వరలో పూర్తి చేస్తామని ,లెండి ప్రాజెక్టు మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి పనులు పూర్తయ్యే విధంగా కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని జాకోర, చందూర్ ప్రాజెక్టులు కూడా పూర్తించేసి రైతులను కాపాడుకుంటామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమత్తు పనులు చేపట్టి 2 లక్షల ఎకరాల భూమి సాగు నీటిని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకుందని ,ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుతున్నమని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రం అప్పుల కుప్పగా చేసిన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిస్కరిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం సమస్య తెలంగాణలో ఉండగా అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ సమస్యలు అదిగామించమని అన్నారు. నూతనంగా 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. ప్రైవేటు రంగంలో సైతం నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సులలో 117 కోట్ల మహిళలు రూ.400 వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. రూ.10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ,200 యూనిట్ల కరెంటు ఫ్రీ అందిస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లబ్దిదారులకు ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణం చేపడతామని అన్నారు.నూతన రేషన్ కార్డులు,త్వరలో సన్న రకం బియ్యం అందిస్తామని అన్నారు. మహిళలకు డ్వాక్ర సంఘం ద్వారా వడ్డీ లేని రుణాలు, లోన్లు పెంచి ఇస్తున్నామని వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ప్రజలు మాకు ఐదేండ్ల పాలన కొరకు ఎన్నుకున్నారు,ఐదేండ్లలో పూర్తిగా ఇచ్చిన హామీలనున్నెరవేరుస్థామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇంట్రెస్ట్ చైర్మన్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండల అధ్యక్షులు మల్లికార్జున్, నాయకులు ప్రజాపండరి ,లోక్య నాయక్,తదితరులు ఉన్నారు.