
కలిగిరి, మన ధ్యాస, జనవరి 27,(నాగరాజు కె ).
నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈ మంగళవారం కలిగిరి మండలం, నాగిరెడ్డిపాలెం నాగసముద్రం గ్రామంలోని రైతు కోడూరు దశరథరామిరెడ్డి పందిరి మీద సాగు చేస్తున్న కాకర, దొండ మరియు బొప్పాయి పంటలను పరిశీలించారు. పంట సాగు విధానం, పెట్టుబడులు మరియు మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.సాంప్రదాయ పంటలకు బదులు నీటి సౌకర్యం కలిగి ఉన్న రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. రైతులు ఒకే రకమైన పంటను కాకుండా రెండు-మూడు రకాల పంటలను సాగు చేయడం ద్వారా మార్కెటింగ ఒడిదుడుకులను తట్టుకొని మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, ఉద్యాన శాఖ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ పొందిన తైవాన్ స్ప్రేయర్ పనితీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కావలి ఆర్డిఓ సన్నీ వంశీకృష్ణ , కలిగిరి ఎంపీడీవో ప్రత్యూష , వింజమూరు ఉద్యాన అధికారి షేక్ షహీల్ , కలిగిరి వ్యవసాయ అధికారి షేక్ జహీర్ , నాగసముద్రం సర్పంచ్ దమ్ము శ్రీనివాసులు ఇతర ప్రభుత్వ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.
