మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: గణతంత్ర దినోత్సవం సదర్భంగా ఉత్తమప్రతిభ కనబరచిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలు అందించారు.కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఉద్యాన శాఖ అధికారిని కె దివ్యశ్రీ ఉత్తమ మండల ఉద్యాన వనశాఖ అధికారినిగా ఎంపికయ్యారు, కాకినాడ జిల్లా కలెక్టర్ అపూర్వ భరత్, చేతులు మీదుగా జిల్లా యస్ పి బిందు మాధవ్ సమక్షంలో ప్రశంసా పత్రాన్ని అందజేశారు.జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా ప్రతిభా పురస్కారము అదుకోవడం చాలా సంతోషానిచిందన్నారు.
ఈ ప్రతిభా పురస్కారం వల్ల నా పై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఈసందర్భగా దివ్యశ్రీ తెలిపారు..