
పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో డ్రైవర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చిన..
జలదంకి, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ).
ఆటోల లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా తెలిపారు. ఆదివారం నేషనల్ హైవే 167 జిబి రోడ్డు పై ఆటోలో పరిమితికి మించి అధికంగా ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తుండగా జలదంకి వద్ద ఎస్సై లతీ ఫున్నిసా ఆటోను గుర్తించి ఆపారు. అనంతరం డ్రైవర్‌కు కౌన్సెలింగ్ చేశారు..పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను తీసుకువెళ్తే ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. తాగి ఆటోలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీవో నిబంధనల ప్రకారం ఆటోలు నడుపుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనాలకు సంబంధించిన అన్ని అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్, రోడ్డు నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడుపాలని కౌన్సెలింగ్ చేశారు…