
చిత్తూరు జనవరి 24 మన ద్యాస
జిల్లా కేంద్రంలోని చిత్తూరు నగరంలో కొంగారెడ్డి పల్లి నందు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన 19వ జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ, జిల్లా కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి పాల్గొనడం జరిగింది. అనంతరం బాలికల దినోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాల్యవివాహాలను, అరికట్టాలని, ఫోక్సో చట్టంపై, బాలికలు తెలుసుకోవాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్, ట్విట్టర్, లాంటి చాటింగ్ యాప్ లలో బాలికలు అప్రమత్తం కలిగి ఉండాలని, వాటిలో మంచిని మాత్రమే తెలుసుకోవాలని, చెడు వాటికి దూరంగా ఉండాలని తెలియజేశారు. చాటింగ్ యాప్, లలో మోసగాళ్లు మాయ మాటలు నమ్మి మోసపోకూడదని, బాలికలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే 1098 నెంబర్ కి ఫోన్ చేయాలని తెలిపారు. అనంతరం బాలికలు ఉన్నత చదువులు చదువుకొని, తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. వివిధ రంగాలలో క్రీడలు, యోగ,వీటిలో పాల్గొని జిల్లా రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్, ఆధ్వర్యంలో మెమొంటో ప్రశంస పత్రాలను జిల్లా జడ్జి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్, వన్ టౌన్ పిఎస్ సిఐ మహేశ్వర్, సిడిపిఓ శ్యామ్ సుగుణ కుమారి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, శ్రీరంగపల్లి మునస్వామి, హెచ్ ఆర్ పి సి జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు, ఎంఈఓ మోహన్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అరుణ, ఐ సి డి ఎస్ సూపర్డెంట్ కవిత, పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రశంసించారు. అనంతరం హెచ్ఆర్సీ కమిటీ సభ్యులతో పాల్గొన్న అతిధులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీ సభ్యులు కిషోర్, దాము, రాజా, రమేష్ బాబు, దుర్గా కుమారి, ప్రియాంక, దేవరాజులు, రూపేష్ రెడ్డి, గోపి, తదితరులు పాల్గొన్నారు.