
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శివకుమార్ కు హసన్‌పల్లి గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్,ఉప్ప గ్రామ సర్పంచ్ గంగారాం లు కలిసి ఎస్ఐ శివకుమార్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్ఐ శివకుమార్ సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండి సహకరిస్తూ, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువస్తున్నారని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప్ప సర్పంచ్ కుర్మా వెంకట్ రాములు, బోయిని సాయిలు, పరుశురాం, శ్రీనివాస్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.