
జలదంకి, మన న్యూస్, జనవరి 24.(నాగరాజు కె ).
జనవరి 24 శనివారం రోజు జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక గ్రామం లో వంటేరు వరదా రెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మరియు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సహకారం తో నారాయణ ఆరోగ్యమస్తు పథకం ద్వారా ఉచిత వైద్య శిబిరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది
ఈ వైద్య శిబిరం కు బ్రాహ్మణ క్రాక పంచాయితీ లోని 9వ మైలు, అంబేద్కర్ నగర్, జువ్వు చెట్టుపాలెం, పొట్లూరి సుబ్బయ్య కాలనీ, బ్రాహ్మణ క్రాక అగ్రహారం, బ్రాహ్మణ క్రాక గ్రామం లోని 260 ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు, గుండె సంబంధిత ఈసీజీ పరీక్షలు, బిపి, షుగర్ పరీక్షలు చేపించుకొని మందులు తీసుకోవడం జరిగింది
ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న అందరికీ భోజన సదుపాయం కల్పించడం జరిగింది
ఈ వైద్య శిబిరంలో సర్పంచ్ ఇండ్ల సుధాకర్, ఉప సర్పంచ్ దగుమాటి మాల్యాద్రి రెడ్డి, వార్డు మెంబర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, వంటేరు అభిమానులు పాల్గొనడం జరిగిందిఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేపించుకునే వీలులేని వారికి సొంత ఊర్లోనే ఆరోగ్య పరీక్షలు చేపించి మందులు ఇప్పించిన కావలి మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది*