మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:
వరుపుల తమ్మయ్య బాబు కుటుంబాన్ని పరామర్శించిన ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అందరి అప్యాయతను చూరగొన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల స్వర్గస్తులైన సంగతి మనందరికీ విదితమే.ఈరోజు వారి నివాసానికి వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం వారి తనయుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరి బాబు తమ్మయ్య బాబు గారి చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం తమ్మయ్య బాబు కుమారుడు వరుపుల సాయి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో
ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని,తమ్మయ్య బాబు ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వరుపుల తమ్మయ్యబాబు(చిట్టిబాబు),ఏలేశ్వరం వైసిపి నాయకులు శిడగం వెంకటేశ్వరరావు,సామంతుల సూర్య కుమార్,సుంకర రాంబాబు,బొదిరెడ్డి శ్రీను
వాగు బలరాం,లోగేష్,వైసీపీ నాయకులు, జనసేన నాయకులు,తమ్మయ్య బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు