మన న్యూస్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ బాలాజీ నగర్ కాలనిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు కు ఎదురుగా డాక్టర్ వెంకటసుబ్బయ్య యాదవ్ నేతృత్వంలో రిషి కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అమర్ సింగ్,డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ అమర్ సింగ్ మాట్లాడుతూ ఆసుపత్రి యాజమాన్యం మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ తమ హాస్పిటల్ లో ఐబీపీ, గుండె నొప్పి,జీర్ణకోశ వ్యాధులు,కిడ్నీ వ్యాధులు, పక్షవాతం,దగ్గు, దమ్ము, అల్సర్ ఛాతిలో నొప్పి మంట,కాలేయ వ్యాధులు,టీబీ, ఊపిరితిత్తుల వ్యాధులు,జ్వరాలు,డెంగ్యూ, మలేరియా వంటి పళ్ళు రకాల వ్యాధులకు తమ హాస్పిటల్ లో చికిత్స అందిస్తామని,స్థానిక ప్రజలు తమ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్గౌ తమి,కార్పొరేటర్ అనంత్ రెడ్డి,సీనియర్ నాయకులు మాడుగుల చంద్రారెడ్డి, పప్పుల అంజిరెడ్డి,కుర్ర శ్రీకాంత్ గౌడ్,బోడిగె కృష్ణా,కో ఆప్షన్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి,ఆసుపత్రి యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.