
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) టికెట్ ఎవరికిచ్చినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి,అందరూ ఐక్యతతో కలిసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ అన్నారు.బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కష్టపడే కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తుందని,పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.పార్టీ బలంగా నిలబడడానికి కార్యకర్తలే మూల స్తంభాలని,వారి శ్రమకు తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు.బిచ్కుంద మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయని, అందులో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు.అయితే పార్టీ నియమ నిబంధనల ప్రకారం 12 స్థానాలకు మాత్రమే టికెట్లు ఇవ్వగలమని,మిగతా నాయకులు ఎవ్వరూ నిరాశ చెందవద్దని సూచించారు. టికెట్ రాని నాయకులకు కూడా భవిష్యత్తులో పార్టీ మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.టికెట్ ఎవరికిచ్చినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, అందరూ ఐక్యతతో కలిసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.వ్యక్తిగత ఆశలు కంటే పార్టీ విజయం ముఖ్యమని,కాంగ్రెస్ పార్టీని బిచ్కుంద మున్సిపాలిటీలో అధికారంలోకి తీసుకురావడమే ప్రతి కార్యకర్త ధ్యేయంగా పని చేయాలని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ… వాటికోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటుందని తెలియజేశారు.బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి పటేల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.