
మన నిజాంసాగర్,( జుక్కల్ ),నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న గొట్టం అజయ్ అనే విద్యార్థి సమీపంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఈతకు వెళ్లి నవంబర్ 7న మృతి చెందిన ఘటనపై విచారణ చేసేందుకు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గురుకుల పాఠశాలను సందర్శించారు. ముందుగా ప్రిన్సిపాల్ చాంబర్ లో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం పలు తరగతి గదులు,మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట గది, డైనింగ్ హాలును పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రత్యేక తరగతులు కొనసాగుతున్న తరగతి గదిలోకి వెళ్లి పరీశీలించారు. ఉపాధ్యాయుల కొరత ఎమైనా ఉన్నదా అంటూ ఆరా తీశారు. సబ్ కలెక్టర్ వెంట జోనల్ అధికారిణి ప్రత్యుష, ప్రిన్సిపల్ జనార్ధన్ తహసీల్దార్ భుజంగరావు,వసతి గృహ సంక్షేమ అధికారి విఠల్,వైస్ ప్రిన్సిపల్ గణపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు,జీపీఓ సంగమేశ్వర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తుకారాం, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
