మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:దశాబ్ద కాలం పైబడి శిధిలా వ్యవస్థకు చేరుకున్న ఏలేశ్వరం మండలం రమణయ్యపేట-జె అన్నవరం ఆర్ అండ్ బి రహదారి పునర్నిర్మాణాలు కోరుతూ సిపిఎం అనుబంధ సంఘాలు గురువారం మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు తెలిపారు. అడ్డతీగల మండలం గుంటువానిపాలెం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట ఆర్ అండ్ బి రహదారిపై ధర్నా, రాస్తారోకో, వంటావార్పు నిర్వహిస్తామన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తున్నామని డప్పు కొట్టుకునే కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి అయిన రమణయ్యపేట-జె అన్నవరం రహదారి ఎందుకు పునర్నిర్మించటం లేదని ప్రశ్నించారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే గిరిజన ప్రజలు బెంబేలెత్తుతున్నారని అన్నారు. 20 నిమిషాల్లో ప్రయాణించవలసిన 12 కిలోమీటర్లు రోడ్డుపై వెళ్లాలంటే గంట సమయం పడుతుంది అన్నారు. వాహనాలు మరమ్మత్తులు గురికావడమే కాకుండా అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రహదారిపై గిరిజనులను వైద్యు నిమిత్తం పట్టణ తరలించే అంబులెన్సులు సైతం మరమ్మత్తుల గురై గిరిజనులు అంబులెన్స్ లోనే ప్రసవించడం, ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా జరుగుతుందన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన 12 గంటల పాటు ఆందోళన నిర్వహించగా ఐ టి డి ఏ పి ఓ స్మరణ్ రాజ్ సెప్టెంబర్ 28వ తేదీలోగా ప్రస్తుత కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టకపోతే కాంట్రాక్టర్ రద్దు చేసి వెంటనే నూతన కాంట్రాక్టర్ తో పనులు చేయిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆమె ఇచ్చి ఐదు నెలల కాలం పూర్తవుతున్న రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో గిరిజన సంఘాలు, పలు ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధుల సహకారంతో రోడ్డు నిర్మాణం సహకారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన తెలిపారు.