
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకు సాగుతోంది.ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి కీలక చర్చలు జరిపారు.ఈ భేటీలో ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్ లో జరుగుతున్న ఎన్నికల వ్యూహాలపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నుంచి ఎమ్మెల్యే,డీసీసీ అధ్యక్షులు విలువైన సలహాలు, సూచనలు స్వీకరించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజాభిప్రాయం,పార్టీ బలాబలాలపై సమగ్రంగా చర్చించి,గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది.నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఘన విజయం సాధించి, నాలుగింటికి నాలుగు కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..జిల్లాలో పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాయి.ప్రతి వార్డులో కాంగ్రెస్ బలం కనిపిస్తుంది.ఈ ఎన్నికల్లో విజయం ఖాయం అని స్పష్టం చేశారు.ఈ విజయాన్ని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గెలుపు బహుమతిగా అందిస్తామని ఎమ్మెల్యే,డీసీసీ అధ్యక్షులు ఒకే స్వరంతో తెలిపారు.ముగ్గురు నాయకుల సమన్వయం, ఆత్మవిశ్వాసం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.