
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి వామన్ రావు అన్నారు నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడారు త్వరగా పనులను పూర్తి చేసుకుంటే విడుదలవారీగా డబ్బులు ఖాతాలో జమ చేయబడతాయని అన్నారు అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు ఆయన వెంట ఎంపీడీవో శివకృష్ణ టెక్నికల్ అసిస్టెంట్లు ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశం పిటి వెంకట్,తదితరులు ఉన్నారు