మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలోని నూతన శ్రీ ఉరుకుందు స్వామి రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సతీమణి చేతుల మీదుగా రైస్ మిల్ ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది రైస్ మిల్ యజమాని అంబుష్ ఎమ్మెల్యే సతీమణి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే సతీమణి రైస్ మిల్ మిషన్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించు మిల్లును పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామకృష్ణారెడ్డి, నాయకులు ఉరుకుందు, చంద్రశేఖర్, నవీన్ రెడ్డి, రాజప్ప, సంతోష్, కృష్ణ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.