
పాలసముద్రం, మన ధ్యాస: పాలసముద్రం మండలం కృష్ణజిమ్మాపురం పంచాయతీ పరిధిలోని ఎస్.ఆర్.కండ్రిగ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుల బృందం మంగళవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి ఎం.వాసు నాయుడు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి సహకరించాలని కోరారు.దీనికి స్పందించిన ఎం.వాసు నాయుడు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్.ఆర్.కండ్రిగ జడ్పీ పాఠశాలకు ఏ విధమైన అవసరం ఉన్నా ఎల్లప్పుడూ ముందుండి సహకరిస్తానని, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.