
బంగారుపాలెం.జనవరి 18 మన ద్యాస
సంక్రాంతి పండుగ సందర్భంగా వజ్రాలపురంక్రికెట్ మైదానంలో10-1-2026 నుండి 18-1-2026 వరకు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో10 టీం లు పాల్గొనగా అందులో ఫైనల్ విన్నర్ గా తుంబకుప్పం టీం రన్నర్ గా ఎగువ మత్యం టీం గెలుపొందారు.మొదటి బహుమతి నగదు రూ.10,000/-లు మెమెంటో ను తుంబకుప్పం టీం క్యాప్టెన్ కిరణ్ వి.కె. గారికి ద్వితీయ బహుమతి నగదు రూ.5000/-లు మెమెంటో ను ఎగువ మత్యం టీం క్యాప్టెన్ సాగర్ చిత్తూరు పార్లమెంటు టిడిపి ఈడిగ బిసి సాధికార సమితి అధ్యక్షులు బుసా నాగరాజ గౌడ్ గారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. మరియు బెస్ట్ బ్యాట్స్మన్ గా బాలు సురేష్, బెస్ట్ బౌలర్ గా ఉదయ్ వి.కె. మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా కటారి దుర్గా గార్లు కె.యం.టి.క్రికెట్ స్టే డియం యాజమాన్యం కోట పాటి మహా లక్ష్మి తులసి పునీత్ నిరంత్ చేతులు మీ దుగా మెమెంటో లు ,మెడల్స్ ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు కోట పాటి పట్టాభి,యాలపల్లి సుబ్రహ్మణ్యం,కలిమిడి బాలాజీ తదితరులు పాల్గొన్నారు
