మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం,
సిరిపురం గ్రామం లో వెంచేసిఉన్న శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం లో కనుమరుగు అవ్వుతున్న అర్జీత సేవలు. స్వామి వారి ఆలయం కి సుమారుగా 25ఎకరాలు పొలం ఉన్న,ప్రతి సంవత్సరం జరిగే గ్రామ ఉత్సవం జరగడం లేదని భోగి,సంక్రాతి, కనుమ నాడు మరియు కార్తీక మాస పర్వదినాలలో జరిపే నాలుగు వారలు కూడా జరపడం లేదు అనిగ్రామస్తులు వా పోతున్నారు .గతంలో దేవాలయం లో దొంగతనలు జరిగినప్పటికీ దొంగలు ఎవరన్నదీ తెలియలేదు అని గ్రామ పెద్దలు గ్రామస్తులు సహకారంతో పెట్టించిన సీసీ కెమెరాలు నేడు పనిచేయడం లేదని కేవలం ఇది దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..