మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత 26 రోజులుగా ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో జీడిపిక్కలు ఫ్యాక్టరీ మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాకు పలువురు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఏ ఐ సి సి టి యు రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు కార్మికుల వద్దకు బుధవారం చేరుకుని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని గొప్పలు చెప్పుకోవడం మాని అర్దాంతరంగా మూసివేసిన జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి కార్మికుల ఉపాధి నిలబెట్టాలని అన్నారు. కార్మికుల ఐక్య పోరాటాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. ప్రభుత్వం యాజమాన్యం, కార్మికులతో వెంటనే చర్చించి తగు పరిష్కారం చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు రొంగల ఈశ్వరరావు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు శీలం అప్పలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పన కోటేశ్వరరావు, పిసిసి సభ్యుడు దర్నాలకోట శ్రీను, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు మొయ్యేటి సూర్యప్రకాశరావు, కార్మికులు ఏ వీరబాబు, చక్రధర్, గోవింద్, కృష్ణారావు, ధర్మాజీ, జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, చంటి సత్య ఉన్నారు.