
మన ధ్యాస,నెల్లూరు జనవరి 16 : 1978, 1979, 1980 సంవత్సరాల్లో నగరంలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం అయ్యారు. ఆర్ఎస్ఆర్ఎంసీ హెచ్లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆ పాఠశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ వారు ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 2011లో ఏర్పాటు చేసిన ఈ కమిటీని రెండు సార్లు ఆత్మీయ సమ్మేళనం జరిగిందన్నారు. మూడవ సారి పండుగ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగింది. అలాగే తమకు విద్యాబుద్ధులు నేర్పించిన అప్పటి గురువులైనటువంటి వై. సాయి ప్రసాద్. టి. రామకృష్ణ చంద్రమౌళి, ఎం. నాగభూషణంలను సత్కరించి గౌరవించుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణకు తమకు అన్ని విధాలుగా సహకరించిన ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. మధుసూధన్ బాబును కూడా సత్కరించామని తెలిపారు. ఈ సందర్భంగా తమతో చదువుకున్నటువంటి పాత విద్యార్థులందరం కలిసి అప్పటి మధుర స్మృతులను గుర్తుకు చేసుకుంటూ ఆటపాటలతో చిందులేసి సందడి చేశామన్నారు. అలాగే తమకు విద్యాబోధనలు నేర్పిన గురువులు, తమ తోటి విద్యార్థులు, రాలేని వారికి కూడా చరవాణి ద్వారా ఈ కార్యక్రమం గురించి సభలో తెలియజేస్తూ వారికి ఆనందాన్ని కలిగించామన్నారు. భవిష్యత్తులో కూడా తమ పూర్వ విద్యార్థులందరం కలిసి ఇటువంటి ఆ హ్లాదకరమైన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్. ప్రకాష్్సంగ్, సీవీ రాజాకిషోర్, కంకిపాటి గోపాల్, కె. రాధాకృష్ణ, కొండా ప్రవీణ్ శంకర్, ఈ. రవీంద్రబాబు. భారీగా పూర్వ విద్యార్థులు, అతిథులు పాల్గొన్నారు. |









