(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు:ప్రత్తిపాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం మండల అధ్యక్షులు కందా వీరాస్వామి ఆధ్వర్యంలో మండల బూత్ కమిటీల నియామకం,పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రత్తిపాడు,ఏలేశ్వరం రూరల్ మండలాల పరిశీలకులు యెనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు,ఏ ఆర్ ఓలకు ఎన్నికల విధానాన్ని తెలియజేశారు. lఈ నెల 16 లోపు మండల అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించి జిల్లా పార్టీ కి వివరాలు అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గ కన్వీనర్ సింగిలీదేవి సత్తిరాజు,రాజా కింగ్ బాబు రాజు,జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాస్,సినీయర్ నాయకులు చింతాకుల రామకృష్ణ, గున్నాబత్తుల రాజబాబు,మండల ప్రధాన కార్యదర్శి ఇంటి బాబూరావు,బీజేపీ నాయకులు కరెడ్ల చక్రి,కొండి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.