
మన ధ్యాస ,ముత్తుకూరు, జనవరి 14 : నెల్లూరు జిల్లా ముత్తుకూరు (మం) ఈపూరు గ్రామంలో వెలసిన శ్రీ విరూపాక్ష స్వామి వారిని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులతో బుధవారం దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో మంత్రి దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ...... రాష్ట్ర ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు."ఈపూరు విరూపాక్ష ఆలయంతో మా కుటుంబానికి 72 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉందని... గత ఏడు దశాబ్దాలుగా మా కుటుంబ సభ్యులందరం ఇక్కడ స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం ఒక ఆచారంగా వస్తోందన్నారు."గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిందని. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ పురోభివృద్ధి వైపు పయనించాలని, ప్రజలందరి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని భగవంతుడిని కోరుకున్నట్లు.."ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంక్రాంతి వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరిక మేరకు, ఈ పురాతన ఆలయ పునరుద్ధరణ కోసం నా పిల్లలు 25 లక్షల రూపాయల విరాళాన్ని అందజేస్తున్నారని. అలాగే టీటీడీ నుంచి మరో 45 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు.."ఈ నిధులతో ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చి, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



