
మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14:నెల్లూరు 13 డివిజన్ బాలాజీ నగర్ లో వైసిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున నిర్వహించిన భోగి వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి యువజన విభాగం నేతలతో కలిసి భోగి మంటలు వేసి భోగి వేడుకలు సందడిగా జరుపుకున్నారు.అనంతరం ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అలివికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన మేనిఫెస్టో పత్రులను భోగిమంటల్లో వేసి దహనం చేశారు.ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ఈ భోగి ప్రజలందరికీ భోగభాగ్యాలు పంచుతూ సిరిసంపదలు తీసుకురావాలని చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.ఈ సందర్బంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ........భోగి, సంక్రాంతి కనుమ పండుగల.. ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలన్నారు.కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అలివి కానీ హామీలిచ్చి ప్రజలను నిలువునా దగా చేసిందన్నారు.ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్.. 50 ఎళ్ళకే బీసీలకు పెన్షన్, పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్.. కలగానే మారాయని అన్నారు. ప్రజలను..మోసం చేసిన కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో పత్రులను ఈరోజు భోగి మంటల్లో వేసి దహనం చేయడం జరిగిందని..ఇది చూసైనా కూటమి మొత్తం ముద్దు నిద్ర వీడాలన్నారు.ఈ దౌర్భాగ్యమైన కూటమి ప్రభుత్వాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి ని ఎందుకు ఓడించామా అని ఈ రోజు ప్రజలు బాధ పడుతున్నారు.ఈ రాష్ట్రంలో .. మళ్ళి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి .. వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని..తెలిపారు.ఈ కార్యక్రమంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


