మన న్యూస్: తిరుపతి కపిల్ తీర్థం రోడ్ లోని మలయాళ సద్గురు సేవ సమాజం నందు బుధవారం గీత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. నిర్వాహకులు పూజ్యశ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వాములుసముద్రాల దశరధి ఆధ్వర్యంలో సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి అదే విధంగా భగవద్గీత పుస్తకానికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో జన్మించిన మలయాళ స్వామి చిన్న వయసు నుంచి దేశమంతుట పర్యటిస్తూ గీతోఉపదేశాన్ని చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అయన తిరుమలకు వచ్చి గోగర్భం సమీపంలో దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన తపస్సు ఆచరించి శ్రీకృష్ణుని ప్రబోధించిన గీత సారాన్ని లోకానికి ప్రబోధించాలని గుర్తు చేశారు. అయన శిస్యులు ఆనాటి నుంచి మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిగా జరుపుకుంటూ భగవద్గీత ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నామని తెలియజేశారు. మానవుడు సంపూర్ణ జ్ఞానం పొందాలన్నా,భవసాగరాన్ని దాటాలన్న భగవద్గీతను సంపూర్ణంగా అనుసరించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి గుండాల గోపీనాథ్ సిద్ధారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డిపలువురు ప్రముఖులు పాల్గొన్నారు.