
. మన ధ్యాస,నెల్లూరు,జనవరి 12: నెల్లూరు నగరం డి ఆర్ ఉత్తమ్ హోటల్లో జరిగిన సమావేశానికి వైసిపి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా పార్టీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి. నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జిల్లా, మండల, గ్రామ/వార్డ్ పార్టీ కమిటీల సంస్థాగత నిర్మాణంపై దిశా నిర్దేశం చేశారు.అన్ని కమిటీలను సకాలంలో పూర్తిచేయాలని నేతలకు.. మిథున్ రెడ్డి సూచించారు.పార్టీ కమిటీల ద్వారా పార్టీ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు.పార్టీ కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు విధ్వంసకర పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకెళ్లాలని పార్టీ నేతలకు మిథున్ రెడ్డి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.........వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు..గత రెండు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది అని అన్నారు.ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా మండల, స్థాయి కమిటీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకుందని.. రాబోయే రోజుల్లో గ్రామ వార్డు స్థాయి కమిటీలను కూడా పూర్తి చేసుకుని.. పార్టీ పూర్తిస్థాయిలో.. సంస్థాగత నిర్మాణం కానుంది అని అన్నారు.పార్టీ కమిటీల ద్వారా.. నియోజకవర్గానికి 10,000 మందిని.. జగనన్న సైనికులుగా.. తయారు చేసుకుంటున్నాం అని అన్నారు.ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెబుతున్నారని ఈరోజు ప్రతిపక్షంలో పార్టీకి అండగా నిలిచి పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విలువ గౌరవం అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని తెలిపారు.ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారని ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు.మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని వారి ఆకాంక్ష మేరకు జగనన్న ప్రభుత్వం వచ్చి తీరుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు.

