
మన ధ్యాస,నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల మోడల్ స్కూల్ హాస్టల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై సమాచారం అందగానే ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్పందించారు.ఆయన ఆదేశాల మేరకు ఎస్డీఎఫ్ నిధులతో,డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సహకారంతో హాస్టల్ ప్రాంగణంలో బోరు వేయించడం జరిగింది.బోరు పనులను అచ్చంపేట్ గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ప్రజాప్రతినిధుల చొరవతో విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించిందని నిర్వాహకులు తెలిపారు. బోరు వేయడంతో నీటి సమస్య పరిష్కారమైందని విద్యార్థులకు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుమలత, హాస్టల్ వార్డెన్ సరితా తదితరులు పాల్గొన్నారు.