
మన ద్యాస, విజయవాడ, జనవరి 10: ప్రజాసత్తా ఆధ్వర్యంలో,ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు అధ్యక్షతన విద్యార్థిని, విద్యార్థుల తల్లి దండ్రులతో విజయవాడ గాంధీ నగర్, ప్రెస్ క్లబ్ నందు విలేఖరుల సమావేశం జరిగినది.ఈసందర్భంగా పులగర శోభనబాబు మాట్లాడుతూ...... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలైన మరియు ప్రతిభావంతులైన ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ,ఈబీసీ,కాపుల విద్యార్థులకు ఉచిత విదేశీ విద్యా పథకం అందించుటకు గాను 2014-2019 విద్యా సంవత్సరంలో అంబేడ్కర్,ఎన్టీఆర్ పేర్లతో టిడిపి ప్రభుత్వం 3326 మందికి 381 కోట్ల రూపాయలను,2022 లో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం(జె.వి.వి.డి) పేరుతో వైసిపి ప్రభుత్వం 408 మంది విద్యార్థులకు 107.7 కోట్ల రూపాయలను కేటాయించడం అభినందనీయం అన్నారు.పాదయాత్రలో ఇప్పటి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు విదేశీ విద్యా స్కాలర్ షిప్పులు ఇస్తామని తెలిపినట్లు, అప్పట్లో 60 మంది విదేశీ విద్య చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు మంత్రి లోకేశ్ నా కలిసినట్లు గుర్తు చేశారు.2022లో జె.వి.వి.డి.పథకం ద్వారా విదేశాలలో ఎం.బి.బి.ఎస్(డాక్టర్) కోర్సుకు క్యూ ఎస్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకు ద్వారా ఎంపికైన విద్యార్థులు ప్రస్తుతం కజికిస్తాన్ దేశం లోని అల్ఫరాబీ యూనివర్సిటీలో ఎమ్ బి బిఎస్ 3వ సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు ఫీజులు చెల్లించకపోతే పరీక్షలకు హాజరు కానివ్వమని వార్నింగ్ లెటర్లు ఇచ్చినట్లు పులగర శోభనబాబు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.కావున రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా పథకం ద్వారా వైసిపి ప్రభుత్వం 2 సంవత్సరాలకు 2 విడతలుగా 12 లక్షలు ఫీజులు చెల్లించినట్లు,ప్రస్తుతం 3వ సంవత్సరం చదువుతున్న,ఫీజు బకాయిలుకు వార్నింగ్ లెటర్లు పొందిన వారికి తక్షణమే బకాయిలు చెల్లించాలని,మిగిలిన 3 సంవత్సరాలకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఓవర్సీస్ పథకం ద్వారా విద్యార్థులకు సాయం అందించాలన్నారు.ఉచిత విదేశీ విద్యా పథకం ను నూతన పాలసీ గా విదేశీ విద్యా ఆర్థిక ఋణాలను 4శాతం వడ్డీతో 14ఏళ్శ వరకు కట్టే వెసులుబాటును క్యూ ఎస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ర్యాంకు రానివారికి మాత్రమే విదేశీ విద్యా ఋణాలు ఇవ్వాలి తప్ప, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకు పొందిన వారికి పూర్తి ఉచిత విదేశీ విద్య ద్వారా స్కాలర్ షిప్పులు,రవాణా, వీసా మొదలగు అన్ని సౌకర్యాలతో పాత స్కాలర్ షిప్ విధానమే కొనసాగించాలని పులగర శోభనబాబు పేర్కొన్నారు.విద్యార్థులు తల్లి దండ్రులు పాత్రికేయులతో తమ ఆవేదన తెలుపుతూ కన్నీరు పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాసత్తా నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు షబానా(నెల్లూరు), మౌలాలి(తాడేపల్లి),గౌసియా(గుంటూరు),విక్టర్,బాబ్జీ,జిలానీ,సమీమ్, హసీనా,నజీముల్లా,ఆసీఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.ప్రజాసత్తా కమిటీలు,డయిల్ ఫర్ ప్రజాసత్తా హెల్ప్ పులగరప్రజాసత్తా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ,డివిజన్,మండల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు శోభనబాబు తెలిపారు.అన్ని వర్గాల ప్రజలు సమస్యల పరిష్కారానికి డయిల్ ఫర్ ప్రజాసత్తా హెల్ప్, వాట్సాప్ ఫర్ ప్రజాసత్తా హెల్ప్ కార్యక్రమాలకు 9989385983 నెంబరును సంప్రదించాలని పులగర పేర్కొన్నారు.
