
మన ధ్యాస, ఇందుకూరుపేట, జనవరి 9: యువత క్రీడా స్ఫూర్తితో ఎదగాలని నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం మండలంలోని పల్లెపాడు డైట్ కళాశాల మైదానంలో శుక్రవారం నందమూరి బసవ రామతారకం మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు జానా గిరిబాబు ఆధ్వర్యంలో 39వ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైనాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు.ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని, టాస్ వేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు.నందమూరి తారకరామారావు దంపతుల జ్ఞాపకార్థం గత 39 సంవత్సరాలుగా నిర్విరామంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందినీయమని నిర్వహణకులను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలోమునగాల రంగారావు,జానా నాగరాజు (కార్పొరేటర్),కోవూరు మధు,ప్రసాద్, పెద్ద సంఖ్యలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి బాలకృష్ణ అభిమానులు, క్రీడాకారులు పాల్గొన్నారు.










