మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కేంద్ర ప్రభుత్వం వాహనాల ఫిట్నెస్ చార్జీలు పెంచడంతో వాహనాలు నిలిచిపోయాయి లారీల ఫిట్నెస్ చార్జీలు తగ్గించి పాత రేట్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లారీ ఓనర్స్ ధర్నా చేపట్టారు. ఏలేశ్వరం స్థానిక లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నరసన తెలుపుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు గొర్లె శివ, అట్టాడ ఆనందరావు, షేక్ సత్తార్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల లారీ ఓనర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని,కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తమ సమస్యలను పరిష్కరించడానికి ఆలోచన చేయాలన్నారు. లారీల ఫిట్నెస్ చార్జీలు గతంలో 2,500 ఉండేవని, ప్రస్తుతం ఫిట్నెస్ చార్జీలు 33 వేల రూపాయలకు పెంచడం ఎంతవరకూ సమంజసం అన్నారు సుమారు 50 రోజులుగా తమ లారీలను నిలుపుదల చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసనను తెలియజేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏ టి ఎస్ విధానం ఉన్నప్పుడు, మోడల్ విధానం పెట్టడం తప్పు అని ఆరోపించారు.ఆంధ్రలో ఉన్నవి చాలా మటుకు పాత మోడల్ లారీలేనని వాటిపై ఫిట్నెస్ చార్జీలు పెంచితే లారీలు నడపలేని పరిస్థితి అన్నారు.రోడ్ టాక్స్ లు పెంచారు, టోల్గేట్ రేట్లు పెరిగాయి, ఆయిల్ రేట్లు పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో లారీలు తిప్పడమే కష్టంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం నూతన ఫిట్నెస్ విధానం పేరు చెప్పి ఫిట్నెస్ చార్జీలను 2500 నుంచి 33 వేల రూపాయలకు పెంచడం లారీ ఓనర్ల ,వాటిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కార్మికుల కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేయడమేనన్నారు. నష్టాలను భరించలేని తాము తమ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు మీడియా ముందుకు వచ్చి తమ గోడు వినిపించుకోవలసి వస్తుందన్నారు. రాష్ట్ర, కేంద్ర లారీ అసోసియేషన్ లు తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన లేదని అన్నారు.కేంద్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు భాగమే కాబట్టి లారీ ఓనర్ల కష్టాలను తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమస్యను పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. కొత్త ఫిట్నెస్ విధానాన్ని రద్దు చేయాలని, మోడల్ లేని లారీలకు పాత ఫిట్నెస్ విధానాన్ని అమలు చేయాలని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.లేనిపక్షంలో దేశవ్యాప్తంగా లారీ యజమానులు తమ వాహనాలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో జ్యోతుల సత్తిబాబు, తోట రాంబాబు, కూరాకుల చంటి, కాకాడ నూకరాజు, శిడగం వీర కృష్ణ, వడ్డానపు లోవరాజు, రాము శ్రీను, తాండ్రాజు రాజేశ్వరరావు,సిరుపరపు పద్దరాజు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.