

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్ల వద్ద 100 % సబ్సిడీపై ఉచిత చేప పిల్లలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జిల్లా మత్స్య శాఖ అధికారి డోల్ సింగ్,జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గాదం సత్యనారాయణ,జిల్లా ఉపాధ్యక్షులు సాయిలు, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ లతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు లో కొబ్బరికాయలు కొట్టి చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.చేపల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.మత్స్యకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.చేపల పెంపకం యూనిట్లను ఏర్పాటు చేసి, నియంత్రిత వాతావరణంలో చేపలను పెంచి వాణిజ్య అవసరాల కోసం ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని అన్నారు.నిజాంసాగర్ రిజర్వాయర్లో మొత్తం 48.18 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లా మత్స్య అభివృద్ధి పథకం కింద కొమలంచ గ్రామంలో 10 లక్షల రూపాయలతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనము నిర్మించడం జరిగిందన్నారు.2025- 26 సంవత్సరంకుగాను 100% సబ్సిడీపై జుక్కల్ నియోజకవర్గంలో 227 చెరువులలో మొత్తం 129.63 లక్షల చేప పిల్లల విత్తనాలు విడుదల చేయడం లక్ష్యంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ సోలమన్,ఎంపీడీవో శివకృష్ణ, సర్పంచులు సంకు లక్ష్మయ్య, మోహన్,కేతావత్ నారాయణ,వడ్ల బ్రహ్మం,నాయకులు గౌస్ పటేల్,అబ్దుల్ ఖాళీక్, బంగ్లా ప్రవీణ్ కుమార్,మంద బలరాం,మత్స్య శాఖ సిబ్బంది ఎల్లేష్,నవీన్,సురేష్,దశరథ్,తదితరులు ఉన్నారు.ముందుగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు జిల్లా మత్స్యశాఖ అధికారి డోల్ సింగ్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
