
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీడీవో శివకృష్ణ ముగ్గు పోసి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.వెల్గనూర్ గ్రామంలో గ్రామ అధ్యక్షుడు వీరారెడ్డి, మంగళూరు గ్రామంలో అధ్యక్షులు చాకలి సాయిలు ముగ్గు పోసి ఇందిరమ్మ ఇండ్ల పనులను ప్రారంభించారు.అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు దశలవారీగా ప్రభుత్వం లబ్ధిదారుని ఖాతాలో నిధులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు పనులను త్వరిగతిన పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భీమ్ రావు, నాయకులు అనిస్,లక్ష్మణ్ దాస్,రాములు,తదితరులు ఉన్నారు