
మన ధ్యాస, నిజాంసాగర్:
నిజాంసాగర్ మండల నూతన తహసీల్దార్‌గా భుజంగరావు సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ సాయిలు, అచ్చంపేట్ జీపీవో సంగమేశ్వర్ లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం భుజంగరావు మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయడం,భూ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.మండలంలో రెవెన్యూ పరిపాలనను మరింత పారదర్శకంగా, ప్రజాహితంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.