Mana News;- డిసెంబర్ 10 రాజాం(మన న్యూస్ ): వెలమలను జాతి పేరుతో కించపరుస్తూ అవహేళన చేయటం జాతిని హీనంగా దూషించడం సమంజసం కాదని రాజాం పాలకొండ డివిజన్ వెలమ సంక్షేమ సంఘం నాయకులు మరిచర్ల గంగారావు మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన షధనగర్ ఎమ్మెల్యే శంకర్ చేసిన విమర్శలుశోచనీయం మని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు .కులం పేరుతో దూషించడం అనాగరికమని అన్నారు .కుల అభిమానం తప్ప కుల పిచ్చి ఉండరాదునే కులం అన్నది జన్మతా వచ్చిందే తప్ప దాన్ని ఎవరు తీసుకురాలేరని కులాన్ని బట్టి ఏ వ్యక్తి లక్షణాలు ఉండవని వారి వ్యక్తిగత వైషమ్యాలుఎవరికైనా ఉంటే వాటిని వ్యక్తిగతంగానే పరిష్కరించుకోవాలి తప్ప దాన్ని మొత్తం కులానికి ఆపాదించడం తగదన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉందనే ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క కులము ఎక్కడ ఊడిగం చేసిన సందర్భాలు లేవని ప్రభుత్వమే ప్రాతిపదికన పరిపాలన చేయాలి తప్ప కులాలవారీగా పార్టీల వారీగా పరిపాలన చేయటం ప్రజాప్రతినిధులకి సముచితం కాదుఅన్నారు .ఇప్పటికైనా కుల దూషణలు ఆయన ఉపసంహరించుకోవాలని కోరారు .