మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ సంక్రాంతి పై గ్రామసభ చేపట్టారు.గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు మండల అభివృద్ధి అధికారి రవికుమార్ వర్మ, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం పై మార్పులను అధికారులు గ్రామ ప్రజలకుఅవగాహన కల్పించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ జి రామ్ జి గా మార్చారని తెలిపారు. ఇప్పటి వరకూ 100 రోజుల పని దినాలను 125 రోజులు పెంచారని అన్నారు. వికసిత్ భారత్ జి రామ్ జి కొత్త చట్టం ప్రకారం ఉపాధి కార్మికులకు సకాలంలో వేతనాలు అదేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందని అన్నారు. శక్తి వంతమైన నిరుద్యోగ భృతి ఏర్పాటు, గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.గ్రామాలలో పారిశుద్ధ్య నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవింద్, నాయకులు,బస్సా ప్రసాద్,నీరుకొండ సత్యనారాయణ,మైరాల కనకారావు,నీరుకొండ అర్జునరావు,గంగిరెడ్ల మణికంఠ,బండారు సూరిబాబు, ఆకుల నాని, తోట హరి,ఫీల్డ్ అసిస్టెంట్ బుద్ధ అశోక్ చక్రవర్తి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు