
తవణంపల్లి జనవరి 2 మన ద్యాస
తవణంపల్లి మండలంలోని గాజులపల్లి గ్రామం నందు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని రోడ్డు భద్రతా పై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు, అవగాహన కలిగి ఉండాలని తవణంపల్లి ఎస్సై డా.నాయక్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం మండలంలో గాజులపల్లి నందు రోడ్డు భద్రతా పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటు బెల్టు ఉపయోగించకపోవడం, సెల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం, అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. దీంతోపాటు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఇన్సూరెన్స్, పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.