మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక షిరిడినగర్ లో బిజెపి కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు,యు వి ఆర్ కంపెనీ చైర్మన్ ఉమ్మిడి వెంకట్రావు స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా గురువారం నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల బిజెపి పార్టీ వివిధ హెూదాలలో ఉన్న నాయకులు, యు వి ఆర్ గ్రూప్ కంపెనీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలం ప్రెసిడెంట్ లౌడ్ శ్రీను,మాజీ ప్రెసిడెంట్ ఊట శ్రీను,ఏలేశ్వరం మండలం నాయకులు గరికి నాగు, ప్రతిపాడు మండల ప్రధాన కార్యదర్శి నానిబిల్లి శ్రీనివాస్,ఏసుబాబు, గణేష్,ఎనుముల రాజా తదితరులు పాల్గొన్నారు.