
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రజా భవన్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో 77% స్థానాలను కైవసం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగరవేసి విజయడంఖా మోగించినందుకు మంత్రి సీతక్క ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషిని అభినందిస్తూ శాలువాతో సన్మానించారు.రాబోయే మున్సిపల్ , ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా మంచి ఫలితాలను సాధించాలని సూచించారు.ఎమ్మెల్యే వెంట సాయి పటేల్ తదితరులున్నారు.