
తవణంపల్లి డిసెంబర్ 30 మన ద్యాస
తవణంపల్లి మండలంలోని మాధవరం పంచాయితీ పరిధిలో స్వస్తిక్ నగర్ ఎస్టి కాలనీ నందు ప్రభుత్వం చేపట్టిన గిరిజన వికాసం కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి పాల్గొని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐసిడిఎస్ సూపర్వైజర్ లావణ్య మాట్లాడుతూ అంగన్వాడి ప్రాముఖ్యత పిల్లల తొలి వెయ్యి రోజుల సంరక్షణ పరిసరాల పరిశుభ్రత బాల్య వివాహాల దుష్ప్రభాలపై అవగాహన కల్పించారు. అనంతరం బాల్య వివాహాల నివారణకు ప్రతిజ్ఞ చేపించారు. అనంతరం గ్రామంలోని ప్రజలకు మండల వైద్యాధికారులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మోహన్ వేల్, వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ అధ్యక్షులు గాలి దిలీప్ ఎంపీడీవో హరి ప్రసాద్ రెడ్డి ప్రభుత్వ సిబ్బందులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.