మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: డిసెంబర్ 31 రాత్రి జరుగు నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టమైన భద్రత చర్యలు ఏర్పాట్లు చేపట్టినట్లు ఏలేశ్వరం ఎస్ ఐ ఎన్ రామలింగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రామలింగేశ్వర రావు విలేకరులతో మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా, యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. రాత్రి 11 దాటిన తర్వాత రోడ్లపై తిరగరాదని హెచ్చరించారు.న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకున్నప్పుడు, పక్క వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తతో నడపాలని,వాహనాలు వేగంగా నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, యువత బైక్‌లపై రేస్ డ్రైవింగ్ చేయడం, సైలెన్సర్లు తొలగించి పెద్ద పెద్ద శబ్దాలు చేయవద్ద వాహనాలు వేగంగా నడపవద్దని హెచ్చరించారు.న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.