మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 10 దేశ రాజకీయాలను శాసించగలిగిన మహోన్నత వ్యక్తి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజారెడ్డి మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలోబిజెపి కూటమి ప్రభుత్వంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని, రాబోయే రోజుల్లో ఆయన దేశ రాజకీయాల్లో ప్రవేశించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వ పాలనలో అరాచకాలు మానభంగాలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని దాంతోనే రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో ప్రజలంతా ఏంటి ఎక్కువ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని, దీంతో దేశ రాజకీయాల్లో ఒక మహాశక్తిగా ఎదిగే అవకాశం దగ్గర పడిందన్నారు. వీటి వల్ల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు ఇతర పోర్టులలో నెలకొన్నప్రభుత్వ బియ్యం స్మగ్లింగ్ మాఫియాను వెలికి తీశారని, రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు హిందువుల వైపు నిలబడ్డ ఏకైక నేత తమ మహానేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ను హతమార్చాలని దుష్టశక్తులు ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన కాపాడేందుకు జనసైనికులం నడిపించమని చెప్పారు పవన్ కళ్యాణ్‌ను తాకాలంటే ముందు మా జన సైనికులను దాటి వెళ్లాలని కచ్చితంగా మా పవన్ కళ్యాణ్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పించాలని రాజారెడ్డి కోరారు. ఈ సమావేశంలో నగర ఉపాధ్యక్షుడు బాబ్జి మధుబాబు సుమన్ మున స్వామి కిషోర్ హేమంత్ పురుషోత్తం మణికంఠ శ్రావణ్ పవన్ కుమార్ వినోద్ రమేష్ రెడ్డి సాయి సుధాకర్ పాల్గొన్నారు.