
మన ద్యాస ప్రతిని ధి, సాలూరు :- విద్యార్దులు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని, క్రమ శిక్షణతో చదువుకోవాలని, ఇష్టపడి చదివితే ఏదీ కష్టం కాదని ఏసీబీ రిటైర్డు జాయింట్ డైరెక్టర్ ఉప్పాడ రవి ప్రకాష్-ఐపిఎస్ అన్నారు. ఆదివారం ఉదయం పట్టణ ఆర్య వైశ్య ధర్మశాలలో జరిగిన యుసిమాస్ ఎనిమిదవ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్దులు, వారి తల్లి తండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. మొదట ప్రముఖ వైద్యులు దాక్షాయణి జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించగా, న్యాయవాది కిలపర్తి రామ్మూర్తి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్ చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ లెక్కల విషయంలో ఎటువంటి భయం, ఆందోళన పడవద్దన్నారు. ఏదైతే కష్టంగా ఉంటుందో దాన్ని ఇష్టంగా చదవాలన్నారు. యుసిమాస్ అనేది అంతర్జాతీయంగా పేరుపొందిన గణిత విధానమన్నారు. ఇటువంటి ప్రక్రియను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడ విద్యార్దులకు నేర్పించటం అభినందనీయమన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిఫెన్స్ అవసరమన్నారు. అదేవిదంగా విద్యార్ధుల తల్లి తండ్రులు తమ పిల్లలకు సెల్ ఫోన్లు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేసారు. అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ జరజాపు ఈశ్వర రావు, డాక్టర్ దాక్షాయణిలు మాట్లాడుతూ విద్యార్ధుల మానసిక వికాసానికి యుసిమాస్ స్పీడ్ అబాకస్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కావున ఈ విధానం పై బాగా దృష్టి పెట్టి కృషి చెయ్యాలన్నారు. తదుపరి రామ్మూర్తి మాట్లాడుతూ తాను పట్టణంలో చైతన్య భారతి స్కూల్ నిర్వహించినప్పుడు విద్యార్దులకు చిన్నతనం నుండే గణితంపై భయం లేకుండా సులువుగా నేర్పేందుకు ఈ విధానాన్ని ప్రారంభించానన్నారు. ఇది మొదట మలేషియాలో ప్రారంభమైందని. నేడు ఆనేక దేశాలకు విస్తరించిందన్నారు. తమ స్కూల్లో టీచర్ గా పనిచేసిన మల్లూరు స్వప్న మోహన్ నేటికీ ఈ విధానాన్ని పిల్లలకు నేర్పించటం హర్షణీయమన్నారు. తదుపరి విద్యార్ధుల మధ్య పోటీలు నిర్వహించి విజేతలకు మేమేంటోలు అందజేసారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. న్యాయవాది మల్లూరు మోహన్ కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నవీన్ కుమార్, భాష, విద్యార్ధుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.
