మన న్యూస్:తిరుపతి డిసెంబర్ 10 తిరుపతి నగరంలోని నడివీధి గంగమ్మ జాతర మహోత్సవం సందర్భంగా మంగళవారం ఆకుతోట వీధి పంటవీధులలోని గంగమ్మ ఆలయాల వద్ద భక్తులకు టిడిపి నాయకులు టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డి అంబలి వితరణ చేశారు. ఈ సందర్భంగా భువన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులతో తిరుపతి నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆ గంగమ్మ తల్లిని పూజించినట్లు భువన్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం వందలాది మంది భక్తులకు, మహిళలకు అంబలిని భువన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు వెంకట, రమేష్ రెడ్డి, లచ్చి, నెల్లూరు బాబు ఏపీ సురేష్ రెడ్డి రామకృష్ణారెడ్డి వి ఆర్ సురేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.