మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రతిపాడు మండలం పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు పోతులూరు గ్రామ శివారున పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు ఎస్ ఐ లక్ష్మీ కాంతం తమ సిభందితో దాడిలు నిర్వహించారు.ఈ దాడులలో పేకాట ఆడుతున్నముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ 3250/-రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట గుండాట కోడిపందాలు వంటి,జ్యుదాలకు,అసాంఘిక కార్య కలాపాలకు ఎవరు పాల్పడిన,ఉపేక్షించేది లేదని వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్సై లక్ష్మికాంతం తెలిపారు.ఎవరయినా.పేకాటలు కోడిపంధాలు మరియు అసాంఘీక కార్యక్రమాలకి పాల్పడిన ఈ క్రింది ఫోన్ నంబర్స్ కి తెలియజేయగలరని సూచించారు..
పోలీస్ కంట్రోల్ రూమ్ నం: 112
SI ప్రత్తిపాడు: 9440796570
CI ప్రత్తిపాడు: 9440796530